Home AP మంత్రాలయం యంపిడిఒ కార్యాలయం లో ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమం

మంత్రాలయం యంపిడిఒ కార్యాలయం లో ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమం

0
0

కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రతి ఒక్కరూ నీటి ని పొదుపుగా వాడుకోవాలి వైకాపా సీనియర్ నాయకులు వై సీతారామిరెడ్డి ప్రతి ఒక్కరూ నీటి ని పొదుపు గా వాడుకోవాలని ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సీతారామిరెడ్డి కోరారు . సోమవారం స్థానిక యంపిడిఒ కార్యాలయం లో ప్రపంచ జల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా ఇంకుడు గుంతకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ వేదిక పై యంపిడిఒ రాధ, ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ వేద స్వరూపిణి లు అధికారులు, సర్పంచి, వార్డు సభ్యులు, యంపిటిసి లు, పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ, సచివాలయ సిబ్బంది తో నీటి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటి ని వృధా కాకుండా పొదుపు గా వాడుకోవాలని కోరారు. నీటి ని విలువైన వనరులుగా గుర్తించాలని కోరారు. జల సంరక్షణే జన సంరక్షణ అన్నారు. మానవ తప్పిదం వల్లే నీటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. నీటి ని పొదుపు చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల దగ్గర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వైకాపా నేత కురువ మల్లికార్జున తన ఇంటి వద్ద కూలిలను పెట్టకుండా స్వంతంగా తనె ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇతనిని ఆదర్శంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్ల దగ్గర ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సర్పంచు లు, వార్డు సభ్యులు, యంపిటిసి లు, వైకాపా నాయకులు కార్యకర్తలు ఇంకుడు గుంతలపై ప్రజల కు అవగాహన కల్పించాలని సూచించారు. ఆదర్శంగా నిలిచిన మల్లికార్జున ను శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ భీమ్ రెడ్డి, ఇన్చార్జి విశ్వనాథ్ రెడ్డి, సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచి హోటల్ పరమేష్, ఏపిఓ తిమ్మారెడ్డి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here