Home AP భారత్ బంద్ విజయవంతం

భారత్ బంద్ విజయవంతం

0
0

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా నకరికల్లులో శుక్రవారం చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూయించారు.అద్దంకి – నార్కట్ పల్లి రాష్ట్ర రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఈవూరి లక్ష్మా రెడ్ది గుంటూరు జిల్లా మాల మహానాడు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్, గోదా బాల, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సైదా, mcpiu మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గాదె కుమారి, బిసీ సంక్షేమ సంఘం మండల కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు, పీడి ఎం నాయకులు షేక్ మస్తాన్ వలి, mim నాయకులు గుత్తికొండ చిన సైదా,ఈసుబ్, సంగులు చిన్న, హనుమత్ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.కృష్ణంరాజు ప్రజా నేత్ర రిపోర్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here