Home AP భారత్ బంద్ జయప్రదం కోరుతూ పోస్టర్ విడుదల – సి ఐ టి యు

భారత్ బంద్ జయప్రదం కోరుతూ పోస్టర్ విడుదల – సి ఐ టి యు

0
0

వెల్దుర్తి మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మార్చి 26వ తేదీ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కేంద్ర కార్మిక సంఘాల ఇచ్చిన పిలుపు మేరకు బందు జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, సీఐటీయూ మండల నాయకులు రాజు, రాముడు మాట్లాడుతూ 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, నాలుగు కార్మిక కోడ్ ల ను రద్దు చేయాలని కోరుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ దేశవ్యాప్తంగా మార్చి 26 జరిగే బందును వెల్దుర్తి మండలంలో జయప్రదం చేయాలని వర్తకులకు మండలంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం బ్యాంకులు, తహశీల్దార్ కార్యాలయము ఎంపీడీవో కార్యాలయం, హౌసింగ్ కార్యాలయము, అగ్రికల్చర్ ఆఫీస్, పంచాయతీ కార్యాలయం, ఎండిఓ కార్యాలయంలో బంద్ జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు రాముడు, సిఐటియు హమాలి యూనియన్ మండల నాయకులు మారన్న, పెద్దన్న, శీను తదితరులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here