Home AP భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవ్ లకు ఘన నివాళులు

భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవ్ లకు ఘన నివాళులు

0
0

భగత్ సింగ్,రాజ్ గురు,సుఖదేవ్ ల 90వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖాజీపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు భగత్ సింగ్ చిత్రపటానికి
పూలమాలతో నివాళులు అర్పించి, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగమణి, సిఐటియు అంగన్వాడి మండల కార్యదర్శి అంజనాదేవి చేతుల మీదుగా బహుమతులు అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన విప్లవ వీరుడు భగత్ సింగ్ ఆశయాలు నేటి యువత అందిపుచ్చుకోవాలని నాటి విప్లవ వీరుల త్యాగఫలం ఈ రోజున మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని అన్నారు. అంతే కాకుండా ఆరోజు భగత్సింగ్ నింపిన పోరాటపటిమల తెగింపును ధైర్యాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.భగత్ సింగ్, రాజ్ గురు, దేఖ్ దేవ్ స్నేహాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.యువత ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయరాలు,ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు…
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here