Home AP ప్రజలకు తాగునీటి సమస్య పరిస్కారం లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు. – మునిసిపల్ ఛైర్మన్...

ప్రజలకు తాగునీటి సమస్య పరిస్కారం లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు. – మునిసిపల్ ఛైర్మన్ మాచనూరు చంద్ర

0
0

మైదుకూరు : మునిసిపల్ పరిధిలో తాగునీటి సమస్య పరిస్కారం లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మైదుకూరు మునిసిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర పేర్కొన్నారు. మైదుకూరు మునిసిపల్ తాగునీటి, వీధిదీపాల పర్యవేక్షణ సిబ్బందితో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. పంపు ఆపరేటర్లు నిత్యం తమకు కేటాయించిన పరిధిలో తాగునీటి సరఫరాను పర్యవేక్షణ చేయాలని సమస్య గుర్తించి అధికారులకు తెలిపి వెంటనే సమస్య పరిస్కారానికి విధులు నిర్వహించాలని అన్నారు. కొన్ని వీధులకు తాగునీటి సరఫరా కాలేదని తెలిసినా ఆ ప్రాంతానికి సరఫరా అయ్యే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ వేసవికాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 75 బోర్లు ఉన్నాయని ఆయా ప్రాంతాలలో ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బోర్లు పనిచేస్తాయని అందులో పదకొండు ప్రాంతాల్లో నీటి నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని గుర్తించామని ఆ ప్రాంతంలో పరిధిలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా బోర్ల నుండి నీటి సరఫరా చేస్తామన్నారు ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని కోరారు తెలిపారు వీధి లైట్ల పర్యవేక్షణ మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని కాలిపోయిన వీధి దీపాల స్థానంలో కొత్తవి అమర్చాలని ఆదేశించారు కొన్ని బోర్లు మరమ్మతులు గురికాగా వాటిలో ఇప్పటి వరకు 6 కొత్త మోటార్లుఏర్పాటు చేశామన్నారు కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ పి.వి.రామకృష్ణ, ఏఈ మధు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here