Home AP పరిమితికి మించి ప్రయాణించి ప్రమాదాలకు గురి కావద్దు-సబ్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్రహ్మణ్యం

పరిమితికి మించి ప్రయాణించి ప్రమాదాలకు గురి కావద్దు-సబ్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్రహ్మణ్యం

0
0

తిరువూరు టౌన్: దినసరి కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వాహనాల పరిమితి మేరకే ప్రయాణించాలని ఎస్సై సుబ్రహ్మణ్యం సూచించారు.నేడు ఉదయం టాటాఏస్ ట్రాలీ వాహనంలో సుమారు 35 మంది కూలీలు పనులకు వెళ్తుండగా గమనించిన ఎస్సై వాహనాన్ని నిలిపి కూలీలను దింపి డ్రైవర్ తో పాటు కూలీలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.వాహన పరిమితికి మించి కూలీలను తరలిస్తే జరిగే ప్రమాదాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.ప్రమాదాల్లో జరిగే నష్టాలను పూడ్చలేరని, కుటుంబాలు విఛ్చిన్నం అవుతాయన్నారు. పరిమితికి మించి కూలీలతో నడిపే వాహన డ్రైవర్లు, ఓనర్ల పై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.రైతులు కూడా ఈ విషయాల పై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న వాహన డ్రైవర్ల పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here