Home AP నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో 100 లీటర్ల చల్లని మజ్జిగ పంపిణీ.

నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో 100 లీటర్ల చల్లని మజ్జిగ పంపిణీ.

0
0

ఎండలో బయటకి వెళ్తే తాగునీటికోసం ఎంత ఇబ్బంది పడతామో, గొంతెండిపోయి తాగడానికి గుక్కెడునీళ్ళు లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. వేసవి తీవ్రత దృష్ట్యా తాగడానికి మంచి నీరు కొసం ఎవరు ఇబ్బంది పడకుండ ఉండడానికి నేస్తం సేవా సంస్థ సభ్యులు మైదుకూరు పట్టణంలో రెండు మెగా చల్లని మినరల్ వాటర్ చలివేంద్రాలను ప్రారంభించి ప్రజల దాహార్తి తీర్చడం జరుగుతుంది.కీర్తిశేషులు పొట్టిపాటి నూర్జహాన్ గారి జ్ఞాపకార్థం… నేస్తం సేవా సంస్థ సభ్యులు మైదుకూరు మున్సిపాలిటీలోని కడప రోడ్డు నందు గల శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సప్లయర్స్ దగ్గర ఉచిత 100 లీటర్ల చల్లని మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించి.. విద్యార్థులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి, , పాదచారులకు, కూలీలకు, పట్టణ ప్రజలకు, ఆటో డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు దాహం తీర్చేందుకు చల్లటి మజ్జిగను పంపిణీ చేసి వేసవి ఎండతో సతమతమవుతున్న వారి దాహార్తిని తీర్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో నేస్తం సేవా సంస్థ సభ్యులు నియాజ్,ఆర్.బి.వెంకటరెడ్డి ,బాలనాగిరెడ్డి,ఉపేంద్రకుమార్, సురేంద్రకుమార్, ప్రసన్నకుమార్, హరిబాబు,రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవలో నేస్తం సేవా సంస్థ మైదుకూరు
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here