Home AP నీటి పరిరక్షణ మనందరి భాద్యత

నీటి పరిరక్షణ మనందరి భాద్యత

0
0

నీటి పరిరక్షణ మనందరి బాధ్యత అని ఎంపీడీవో ఈవి సుబ్బారెడ్డి ప్రత్యేక అధికారి రవి ప్రకాష్ ఈవో ఆర్ డి నరసింహులు టెక్నికల్ అసిస్టెంట్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రపంచ జల దినోత్సవం నిర్వహించారు అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశం మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో సుబ్బారెడ్డి హాజరయ్యారు సచివాలయ సి బ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి నీటిబొట్టును వృధా చేయరాదని నీటిని సద్వినియోగం చేసుకోవాలని నీటివనరులు అత్యంత విలువైనవని తెలిపారు.నీటిని పొదుపుగా వాడుకుంటూ భూగర్భజలాలను రక్షించుకోవాలని ఎంపీడీవో ఈవి సుబ్బారెడ్డి ఈవో ఆర్ డి నరసింహులు టెక్నికల్ అసిస్టెంట్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. నీటిని వృధా చేస్తే భవిష్యత్తు లో నీటికోసం యుద్దాలు చేయవలసి వస్తుందని వారు తెలిపారు ఈకార్యక్రమంలో గ్రామ రెవిన్యూ అధికారి రామ్మోహన్ రెడ్డి సచివాలయ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు జూనియర్ అసిస్టెంట్ రామాంజనేయులు గ్రామ వాలంటీర్ ఫరీద్ ఉదయ్ శివ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర న్యూస్ మౌలాలి వెల్దుర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here