Home AP నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని తహశీల్దార్ శివరాముడు కి విన్నత పత్రం

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని తహశీల్దార్ శివరాముడు కి విన్నత పత్రం

0
0

కర్నూల్ జిల్లా ప్యాపిలి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు ఎ వస్తువు కొనుగోలు చేయాలన్న ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల సామాన్య, పేద,
మధ్య తరగతి ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి లో వున్నారాని ఇటీవల కాలంలో వంటనూనె 100/రూపాయల నుండి రెండు వందల రూపాయల కు పెరగడం, కంది పప్పు,బియ్యం, చెక్కర, బెల్లం,కూరగాయలు, కారం పొడి, ఉల్లి గడ్డలు మొదలైన నిత్యావసర సరుకులు ధరలు పెరగడం ద్వారా పేద ప్రజలకు పౌష్టిక ఆహారం దొరకక జీవన ప్రమాణం తగ్గి అనారోగ్యల బారిన పడే అవకాశాలున్నాయి. దీనిని ఆసరాగా చేసుకొని నకిలీ వ్యాపారస్తులు నకిలీ సరుకులను మార్కెట్లో కి విక్రయించే అవకాశం వుంది.అదేవిధంగా వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు కూడా రోజురోజుకి పెరగడం ద్వారాసామాన్య, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించాలనితహశీల్డర్ కి విన్నత పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తిరుమలయ్యా,శేషయ్యా,రాధమ్మ,చిన్న పుల్లయ్యా,గంగాధర్ ఆచారి,వీర్రాజు,నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజనేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here