Home AP దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న పసివాడు..

దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న పసివాడు..

0
0

రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో బుడిబుడి అడుగుల చిన్నోడికి పెద్ద జబ్బు చేసింది. తల్లిదండ్రులదేమో సామాన్య కుటుంబం. కానీ లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో చేసేది లేక అందిన కాడికి అప్పులు తెచ్చి వైద్యం చేయిస్తూ.. కొడుకుకు మెరుగైన వైద్యం అందించడానికి డబ్బుల్లేక దాతల సహాయం కోసం అర్థిస్తున్న ఆ నిరుపేద తల్లిదండ్రుల దీనస్థితిని చూసి పలువురు కంటనీరు పెట్టారు.కడప జిల్లా, మైదుకూరు మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ నందు గల రాయచోటి రవి, శ్రీమతి రాయచోటి మెర్సీ మొదటి కుమారునికి సోకిన అరుదైన నరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఫలితం లేకపోవడంతో, ఫలితంగా వీరివద్ద ఉన్న డబ్బంతా బాబు కోసం ఖర్చు కావడంతో వీరి కుటుంబ పోషణ భారంగా మారింది. బాబు కోసం మైదుకూరు నేస్తం సేవా సంస్థ సభ్యులు దాతల నుంచి 3610 రూపాయి సేకరించడం జరిగింది. సేకరించిన డబ్బులను తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది.

సహాయం చేయదలిచిన వారు 7569680476 నంబరును సంప్రదించవలేను.
దయగల దాతలు బాలునికి సహాయం చేయవలసిన వారు ఈ కింద ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు పంపగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here