Home AP చైర్మన్ చొరవతో తొలగిన తాగునీటి సమస్య – చౌడేశ్వరినగర్ బోరు మరమ్మతులు పూర్తి

చైర్మన్ చొరవతో తొలగిన తాగునీటి సమస్య – చౌడేశ్వరినగర్ బోరు మరమ్మతులు పూర్తి

0
0

మైదుకూరు : మైదుకూరు మునిసిపాలిటీ 4వ వార్డు చౌడేశ్వరినగర్ నగర్ లో తాగునీటి బోరు మరమ్మత్తుకు గురైంది. దీంతో ఛైర్మన్ మాచనూరు చంద్ర బోరు వెంటనే మరమ్మతులు చేసి సమస్య పరిస్కారం చేయాలని సిబ్బంది ని ఆదేశించారు. బోరు మరమ్మతు పూర్తి ఐనది. సమస్య పరిష్కారం కావటం తో తాగునీటి సరఫరా పునరుద్ధరణ కావటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక బోరు ను చైర్మన్ మాచనూరు చంద్ర ఏఈ మధు, రామదాసు తో కలిసి పరిశీలించారు. ఇదే తీరుగ పనితీరు మెరుగ్గా కనబరిచి మునిసిపల్ పరిధిలో ప్రజలకు తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా విధులు నిర్వహించాలని చైర్మన్ మాచనూరు చంద్ర మునిసిపల్ తాగునీటి పర్యవేక్షణ సిబ్బంది కి ఈ సందర్భంగా సూచించారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here