Home AP ఘనంగా సర్పంచి, ఉప సర్పంచి వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం

ఘనంగా సర్పంచి, ఉప సర్పంచి వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం

0
0

చాపలమడుగు పంచాయతీ లొని స్థానిక సచివాలయంలో శుక్రవారం సర్పంచి (తమ్మినేని సత్తిరెడ్డి ), ఉప సర్పంచి (చిట్టీ నారాయణమ్మ ) వార్డ్ నెంబర్ లతో ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ గ్రామంలో ప్రథమ పౌరురాలు అయినటువంటి సర్పంచి గారి ఆధ్వర్యంలో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. గ్రామంలో ప్రధాన అంశాల…1. పారిశుద్ధ్యం. 2.వీధి దీపాలు. 3.జల శక్తి అభియాన్ కార్యక్రమం 4.మొక్కల పెంపకం. 5.మంచినీటి సమస్య. 6.ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల కార్యక్రమాలను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరువయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వార్డ్ నెంబర్లు కూడా తమ విధుల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు.అనంతరం మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తిరెడ్డి యువసేన నాయకులు-రమణారెడ్డి, రవి,తిరుపతిరెడ్డి, చిన్న స్వామీ,నారాయణ, వెంకటకోటిరెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దావీదు, డిజిటల్ అసిస్టెంట్ ఏడుకొండలు, వెల్ఫేర్ నర్సిరెడ్డి, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here