Home AP ఘనంగా తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0
0

వెల్దుర్తి మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో 40 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం టిడిపి మండల అధ్యక్షుడు బలరాంగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెల్దుర్తి మండల టిడిపి సీనియర్ నాయకులు బొమ్మన శివశంకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ “నందమూరి తారక రామారావు” గారు. తెలిపారు అదేవిధంగా తెలుగుజాతి ఆత్మవిశ్వాసాన్ని దేశానికి చాటి చెప్పిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయడు గారు అని తెలిపారు నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు వెల్దుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జెండా ఎగురవేసి,కీర్తిశేషులు శ్రీ నందమూరి తారకరామారావు గారి చిత్రపటానికి పూలమాలలుతో నివాళులు అర్పించి అనంతరం జెండా ఆవిష్కరించారు. నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరని ప్రజా అభిమానంతో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలు, నాయకులే పార్టీ ఆరంభించిన నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదలకు సంక్షేమ పథకాలు పా రంభించారు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి యువతరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు
తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు మహా నాయకుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన మన తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బలరాంగౌడ్ సుధాకర్ గౌడ్ నాయకులు వీరభద్రుడు నారాయణ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here