Home AP కొత్త పోస్టుల్లో చేరిన ఉపాధ్యాయులకు జీతాలు వెంటనే చెల్లించాలి – డిటిఎఫ్ జిల్లా కార్యదర్శులు పూజారి...

కొత్త పోస్టుల్లో చేరిన ఉపాధ్యాయులకు జీతాలు వెంటనే చెల్లించాలి – డిటిఎఫ్ జిల్లా కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, గురుగుబెల్లి గోపాలరావు.

0
0

శ్రీకాకుళం, పొందూరు కొత్త పోస్టుల్లో చేరిన ఉపాధ్యాయులకు జీతాలు వెంటనే చెల్లించాలి – డిటిఎఫ్ జిల్లా కార్యదర్శులు పూజారి హరిప్రసన్న మరియు గురుగుబెల్లి గోపాలరావు.గత జనవరి నెలలో జరిగిన ఉపాధ్యాయ బదిలీలలో కొత్తగా మంజూరైన ఖాలీల్లో చేరిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిటిఎఫ్ జిల్లా కార్యదర్శులు పూజారి హరిప్రసన్న మరియు గురుగుబెల్లి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా జీతాలు లేక ఆయా ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రకరకాల కారణాలతో విద్యా శాఖ అధికారులు, ట్రైజరీ అధికారులు జీతాలు చెల్లించడంలో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరువేల మంది ఉపాధ్యాయులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదని అన్నారు. రీ అపోర్షన్ పోస్టుల్లో బదిలీ కోరిన అందరి ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించని పక్షంలో డిటిఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.అలాగే 11వ పిఆర్సీ అమలు చేయడంలో కాలయాపన కమిటీలు వేసి వాయిదా వేస్తుండటం సరైనది కాదని అన్నారు. 50% ఫిట్మైంట్ తో 11వ పిఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గురుగుబెల్లి వెంకటరావు, ప్రజానేత్ర – రిపోర్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here