Home AP కార్మిక, కర్షక, బడుగు , బలహీన వర్గాలు కోసం తెదేపా ఆవిర్భావం

కార్మిక, కర్షక, బడుగు , బలహీన వర్గాలు కోసం తెదేపా ఆవిర్భావం

0
0

చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు తెదేపా శ్రేణులు కృషి చేయాలి

పేదల, బడుగు, బలహీన వర్గాలకు అండ తెదేపా జెండా

-రెడ్యం సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల కోసం డా. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పేద, బడుగు, బలహీన వర్గాలకు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అగ్ర కులాలలోని పేదలకు అండ తెలుగుదేశం పార్టీ జెండా అని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి స్పష్టం చేశారు.తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన ఖాజీపేట బస్టాండ్ సర్కిల్ లో సోమవారం ఉదయం రెడ్యం జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ నిలువెత్తు చిత్ర పటానికి రెడ్యం, ఆయన సోదరుడు తెదేపా మండల అధ్యక్షుడు రెడ్యం చంద్ర శేఖర్ రెడ్డితో కలిసి పాలాభిషేకం చేసి , పూలమాలలు వేసి, బాణాసంచా పేల్చి తెదేపా ఆవిర్భావ వేడుకలను రెడ్యం సోదరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు పాల్గొనగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా శ్రేణులను ఉద్దేశించి రెడ్యం ప్రసంగిస్తూ భారత చలనచిత్ర చరిత్రలో ఏ హీరో తీసుకోనంత పారితోషకం తీసుకున్న సమయంలో వాటన్నింటిని వదిలి కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాలకోసం 1982 మార్చి 29వ తేదీన తెదేపా స్థాపించి అనంతరం కేవలం 9 నెలల్లో అధికారంలోకి రావడం, ప్రాంతీయ పార్టీ తెదేపా పార్లమెంట్ లో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అని, అలాంటి రికార్డు ల రారాజు, భారత దేశ చలనచిత్ర చరిత్రలో ఏ హీరో పోసించనన్నీ పాత్రలు పోషించిన ఎన్టీఆర్ కు భారత ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలసిందేనని ఆయన డిమాండ్ చేశారు.ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు నారా చంద్రబాబు నాయుడు అని ఆయనను తిరిగి ముఖ్యమంత్రి ని చేసేందుకు, వైసీపీ రాక్షస పాలన కు చరమగీతం పాడేందుకు తెదేపా శ్రేణులు కృషి చేయాలని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. వైసీపీ శ్రేణులు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఇబ్బందులకు గురిచేసినా ధైర్యంగా పోరాడే తెదేపా శ్రేణులకు పాదాభివందనం అని , ఇలాంటి కార్యకర్తలు తెదేపా కె సాధ్యమని రెడ్యం అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా మైనారిటీ సెల్ ఉపాధ్యక్ష, కార్యదర్సులు కె.ఫారూఖ్ ఆహ్మద్, కమలాపురం గౌస్, కేసి కెనాల్ పత్తూర్ నీటి సంఘం అధ్యక్షుడు నంద్యాల సుబ్బయ్య యాదవ్, నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు బక్కిన సునీల్ ముదిరాజ్, టి ఎన్ ఎస్ ఎఫ్ ఉపాధ్యక్షుడు పల్లె గంగాధర్, తెలుగు యువత మైదుకూరు గ్రామీణ అధ్యక్షుడు నెట్లపల్లి శివరాం యాదవ్, తెదేపా మైదుకూరు మండల నాయకులు కటారు వీర్రాజు, కేసా కళ్యాణ్, తెదేపా నేతలు సంధుల నాగ శివారెడ్డి, మల్లె ఓబయ్య యాదవ్, తుపాకుల గంగిరెడ్డి, మామిళ్ల కృష్ణారెడ్డి, నారాయణ యాదవ్, సన్నుపల్లె సుబ్బారెడ్డి, బొంగు శ్రీను, రమణ ముదిరాజ్, ముత్తూరు రఘురామిరెడ్డి, మామిళ్ల సుబ్బారెడ్డి, రెడ్యం నారాయణరెడ్డి, ఇండ్ల వెంకట రెడ్డి, రెడ్యం నాగేశ్వర్ రెడ్డి, దాసరి బాలాయదవ్, మానికింద వెంకటేష్, పుల్లల చెరువు భాస్కర్ రెడ్డి, తలసాని సుధాకర్ యాదవ్, బుక్కె సాములా నాయక్, పరిటాల పెరయ్య, సందిళ్ళ సుధాకర్ యాదవ్, మిట్టా శ్రీరాములు రెడ్డి, జెండాల మహబూబ్ భాషా, శంసీక్, మహబూబ్ భాషా, అప్పనపల్లె జయరాజ్, పాలెం రమణయ్య, గుడిమే సుధాకర్, తుమ్మల కృష్ణారెడ్డి, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, మున్నెల్లి సుబ్బరాయుడు, గొడ్లవీటి సుబ్బారాయుడు తదితరులు పెద్దఎత్తున తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here