Home AP కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న టి.డి.పి నేతలు

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న టి.డి.పి నేతలు

0
0

వింజమూరులోని నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు గురువారం నాడు మండల తెలుగుదేశం పార్టీ నేతలు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ చల్లా.వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ మన దేశంలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు దేశీయంగా రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమైందేనన్నారు. ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సిన్ విషయంలో వస్తున్న వదంతులు, అపోహలను నమ్మవద్దని కోరారు. ప్రభుత్వాల సూచనలు పాటిస్తూ అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకుని ఈ మహమ్మారిని శాశ్వతంగా పారద్రోలాలని పిలుపునిచ్చారు. వైధ్యాధికారి డాక్టర్ అంశూధర్ నేతృత్వంలో ఫార్మాసిస్ట్ ఆయేషా, వ్యాక్సినేటర్ జూపల్లి.శివకృష్ణలు పలువురికి వ్యాక్సిన్లు వేశారు. ఈ ప్రక్రియలో టి.డి.పి మండల ప్రధాన కార్యదర్శి గూడా.నరసారెడ్డి, చల్లా.యానాదయ్య,గుర్రం.తిరుమలరావులతో పాటు పాతూరు మాజీ యం.పి.డి.సి సభ్యురాలు చిట్నేని.పద్మజ, చేబ్రోలు.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here