Home AP ఓర్వకల్లులో భారత్ బంద్ విజయవంతం సిపిఎం ప్రజాసంఘాలు

ఓర్వకల్లులో భారత్ బంద్ విజయవంతం సిపిఎం ప్రజాసంఘాలు

0
0

భారత్ బంద్ సందర్భంగా ప్రజాసంఘాల కార్యాలయం నుండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తున్న నరేంద్రమోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ బస్టాండ్ ఆవరణలో రిజిస్టర్ ఆఫీస్ స్కూలు బ్యాంకులు షాపులు ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించి జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ బి. నాగన్న సిఐటియు మండల అధ్యక్షులు ఎస్ షాజహాన్ సిఐటియు మండల నాయకులు జి.శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా బి నాగన్న మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు రైతులకు కష్టజీవులకు అన్ని రంగాల ప్రజలకు అనుకూల మైనటువంటి చట్టాలను మార్చేసి దేశం దివాలా తీసే విధంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు రైతులు ఢిల్లీలో వంద రోజులకు పైగానే పోరాటం చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని బడా పెట్టుబడిదారులు కార్పొరేట్ లకు కారుచౌకగా అమ్మి దేశాన్ని దివాలా తీయిస్తున్నారని అన్నారు విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ అనేకమంది ప్రాణ త్యాగాలు వామపక్షాల ఎంపీలు ఎమ్మెల్యేలు 55 మంది రాజీనామాలతో పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ను అదేవిధంగా దేశం లో ఉన్నటువంటి రైల్వే ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ బ్యాంకులు పెట్రోలియం విద్యుత్ రంగం బొగ్గు గనులు ఇన్సూరెన్స్ కంపెనీలు భారతదేశంలో ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి అన్ని సంస్థలను ప్రైవేటు పరం చేసి బడా పెట్టుబడిదారులను లక్షల కోట్లకు అధిపతులుగా చేయాలన్నది మోడీ ఆశయం లా ఉందని విమర్శించారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా ఇటువంటి చర్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్న వై ఎస్ ఆర్ సి పి .టిడిపి. జనసేన లాంటి పార్టీలు ప్రజల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాసం భాష వెంకటేశ్వర్లు గఫూర్ మియా బుగ్గ రాముడు మా భాష సంజీవ అంగన్వాడి వర్కర్స్ ఆటో వర్కర్స్ రైతులు కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…ప్రజానేత్ర….మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here