Home AP ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ జీపు జాత ను జయప్రదం చేయండి

ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ జీపు జాత ను జయప్రదం చేయండి

0
0

ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ జీపు జాత ను జయప్రదం చేయండి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అఖిలభారత యువజన సమైక్య ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన నిర్వహిస్తున్న జీపు జాత విద్యార్థులు యువకులు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు టి. కృష్ణ. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమన్న లు విద్యార్థులకు యువకులకు పిలుపునిచ్చారు స్థానిక సీపీఐ కార్యాలయంలొ వారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు హామీలు గుర్తించారని కానీ ఇప్పటి వరకు వీటిని పూర్తి చేయలేదని ఆంధ్రప్రదేశ్ కి ముఖద్వారంగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా పూర్తిగా వెనుకబడి ఉందని జిల్లాలో విద్యార్థులు యువకులు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు అని జిల్లా లో నియోజక వర్గాలలో కూడా డిగ్రీ కళాశాలలు లేకపోవడం చాలా సిగ్గు చేటని అదేవిధంగా నియోజక వర్గాలలో కళాశాలల ఏర్పాటు కోసం నూతన పరిశ్రమల కోసం విద్యార్థి యువజనులను ఏకం చేస్తూ రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు బుద్ధి చెప్పే విధంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అఖిలభారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రెండవ తేదీన కర్నూలు జిల్లాలో జీపు జాత మొదలవుతుందని ఆ జీపు జాత ఐదో తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయానికి వెల్దుర్తి చేరుకుంటుందని ఐదో తేదీన జీపు జాత లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు విద్యార్థులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జీపు జాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో అడవి రాముడు మహబాషా వెంకటేష్ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు… ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here