Home AP ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయ్యాలి… కాంగ్రెస్ పార్టీ

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయ్యాలి… కాంగ్రెస్ పార్టీ

0
0

కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీ అహ్మద్ అలీఖాన్ గారు,పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ క్రాంతి నాయుడు గారు వారి ఆదేశాల మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా పొలాల్లో మట్టికతవలు వేయించడం,గులకరాళ్ళు,గుట్టలు తొలగించుట, బావుల్లో పూడికలు తీయాలి, పొలాలు కొతలకు గురికాకుండా కాలువలు తీయ్యడం మరియు చెరువు ద్వారా ఓండు మట్టి పనులు చేయించాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కార్యదర్శి బొందిమడుగుల మహాబూబ్ భాషా గారు గురువారం తుగ్గలి ఎంపిడిఓ వీర రాజు గారికి వినతి పత్రం అందజేశారు.అలాగే ప్రతి జాబ్ కార్డుకు 200 రోజులు పని దినాలు కలిపించాలని ఆయన అన్నారు.ఉపాధి కూలీలకు పనికి సంబంధించిన సామాగ్రి మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఆనంతరం ఆయన కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించే విధంగా వారికి అవగాహన కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…ప్రజానేత్ర.మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here