మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర్య సమరయెాధులు సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రావు 114 వ జయంతి సందర్భంగా వెల్దుర్ధి మండలలో సీపీఐ ఆఫిస్ లో బాబు జగ్జీవన్ రావు చిత్ర పటానికి పుాల మాల వేసి నివాళ్ళులర్పించారు .ఈసందర్భంగా సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టీ. కృష్ణ AISF జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి డీ. సోమన్న. రైతు సంఘము మండల కార్యదర్శి. మాధవ కృష్ణ లు మాట్లాడుతూ అంటరానితనం వివక్షపై పోరాడిన నేత బాబు జగ్జీవన్ రావు 1908 ఏప్రిల్ 5 న బీహార్ లోని షాహబాద్ జిల్లాలోని చాంద్వా గ్రమంలో జన్మించారు చిన్నప్పుడే తండ్రీ మరణించడంతో తల్లి సంరక్షణాలలో విద్యాబ్యాసం చేశారు 1935 సంవత్సరంలో ఇండియన్ డిప్రెస్ క్లాసెస్ లీగ్ స్థాపనలో కిలక పాత్ర పోషించారు 1937 సంవత్సరంలో బీహర్ శాసన సభకు ఎన్నిక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా అనేక శాఖలలో పనిచేశారన్నారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మిక సంక్షేమం సామాజిక భద్రత చట్టం మరియు పి ఎప్ చట్టం తెచ్చారన్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవానికి నాంది పలికారు భారత దేశ ప్రకలకు అహర భద్రత విషయంలో భరోసా కల్పించారన్నారు పేద బడుగు వర్గాల ప్రజలకు అండగా నిలచారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు డీ. రాజు. ప్రసాద్. భాష. మహ్మద్ బాష్ తదితరులు పాల్గొన్నారు … ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి