జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజా వీర సూర్య చంద్ర మరియు నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నం టౌన్ కి వెళ్లే మార్గంలో పెద్ద బొడ్డేపల్లి వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద నిరసన తెలియజేశారు ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా సూర్య చంద్ర మాట్లాడుతూ నర్సీపట్నానికి ముఖద్వారం అయినటువంటి ప్రధాన బ్రిడ్జి పనులు సకాలంలో పూర్తి చేయకుండా గత ప్రభుత్వం అలసత్వం వహిస్తే ప్రస్తుత ప్రభుత్వం అదిగో పూర్తి చేస్తాం ఇదిగో పూర్తి చేస్తాం అంటూ కాలయాపన ఎందుకు చేస్తున్నారు ఏజెన్సీకి ముఖద్వారమైన ప్రధాన పట్టణం మన నర్సీపట్నం నిరంతరం జనం రద్దీతో ఉండే రోడ్డుకి అనుసంధానం అటువంటి ఈ ప్రధాన బ్రిడ్జి పనులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు ప్రభుత్వాలు మారినంత మాత్రాన అసంపూర్తిగా ఉన్న పనులు ఈ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయదు ??? తక్షణమే స్పందించి స్థానిక శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు సంబంధిత అధికారులకు బ్రిడ్జి పనులు పూర్తి అయ్యేలా ఒత్తిడి తీసుకుని వచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని లేనిపక్షంలో రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యాలయం ముందు జనసేన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు Addepalli గణేష్ . నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు Voodi. చక్రవర్తి. p. నాగు. కొప్పాక కళ్యాణ్. గోపి. Niవాస్ కుషి . సూరవరపు శ్రీను. అల్లు నరేష్ . శ్రీకర్ పవర్. రామ శేఖర్ . కొత్తకోట శేఖర్. B. మురళి . కర్రీ నరేష్ తదితరులు పాల్గొన్నారు