PMFME స్కీమును సద్వినియోగం చేసుకోవాలి

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:04-08-2022 ; ఆదిలాబాద్ జిల్లాలో గల యువకులు, నిరుద్యోగులు, రైతులు, ప్రాసెసింగ్ యూనిట్స్ వ్యాపారస్తులు PMFME స్కీమును సద్వినియోగం చేసుకోవాలని డిఆర్పి శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహార పదార్థాలకు, ఆహార శుద్ధికి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయని తెలిపారు. గ్రామస్థాయిలో ఈ యూనిట్స్ పెట్టుకోవడం వల్ల ఉపాధి పొందవచ్చు అన్నారు. నిరుద్యోగ యువతకు ఈ యూనిట్లో ఉపాధికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. యూనిట్ నిర్వహకులు 10% కాంట్రిబ్యూషన్ పెట్టాల్సి ఉంటుందన్నారు. ఒక యూనిట్లో 35% సబ్సిడీ ఉందని తెలిపారు. ఆసక్తి గలవారు చరవాణి నెంబర్ 7988122600 కు సంప్రదించాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.