75 వ స్వతంత్ర వజ్రోత్సవ లో భాగంగా ముగ్గుల పోటీలు

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్ట్ 20 ; స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా భూపాలపల్లి పట్టణంలో శనివారం రోజున ఇల్లందు క్లబ్ హౌస్ నందు రంగుల హరివిల్లు తలపించేలా ముగ్గుల పోటీలు జరిగినవి. ఈ పోటీలను డి ఆర్ డి ఓ శాఖ ద్వారా నిర్వహించారు. మహిళలు యువతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరూ భారత స్వాతంత్ర భావన వ్యక్తం అయ్యేలా రంగురంగుల ముగ్గులను వేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, జడ్పీ వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభ ,మున్సిపల్ ఏఈ రోజా ముగ్గుల పోటీ కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, స్వాతంత్రం పట్ల తమ మనసులో ఉన్న భావనను ముగ్గు ద్వారా వెలుపరిచారని చాలా చక్కగా ముగ్గులు వేశారని అందరి ముగ్గులు చాలా బాగున్నాయని మొదటి బహుమతిని ఎంపిక చేయడం చాలా కష్టంగా మారిందని జిల్లా అదనపు కలెక్టర్ దివాకర తెలిపారు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనదేశంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అ ముందుంటున్నారని అదనపు కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్, జడ్పీ వైస్ చైర్పర్సన్, మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల నుండి ఇంతమంది మహిళలు ముగ్గుల పోటీలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని వారి వారి భావాలకు తోచినట్టుగా రంగురంగుల ముగ్గులు వేశారని స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో పాల్గొన్న మహిళలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలిచిన విజేతలలో మొదటి బహుమతి కె ఇందు, రెండవ బహుమతి సుమలత, మూడో బహుమతి కోమల, కు అదనపు కలెక్టర్ దివాకర బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పురుషోత్తం రావు, హార్టికల్చర్ అధికారి అక్బర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పిడి అర్బన్ వేములవాడ రాజేశ్వరి, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు తిరుపతమ్మ, సిబ్బంది పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.