ఆగష్టు 14న తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం

ప్రజానేత్ర న్యూస్,కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన,తేది:10- ఆగస్ట్ -2022:
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ దుర్గం రవీందర్ కోరారు. ఈ సందర్భంగా ఈనెల 14న తెలంగాణ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం రెబ్బెన మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆగష్టు 14న హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోలో తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఉపేందర్, మల్లేష్, ప్రభాకర్, రవికుమార్, తిరుపతి, రహీం, గోపాలకృష్ణ, అరవింద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజానేత్ర .రిపోర్టర్:తిరుపతి,రెబ్బెన మండలం,ఆసిఫాబాద్

Leave A Reply

Your email address will not be published.