స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రెబ్బెన పోలీస్ స్టేషన్ భవనం ప్రాంగణంలో మొక్కలు నాటిన ఎస్సై భూమేష్

ప్రజానేత్ర న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన ,తేది:10- ఆగస్ట్ -2022: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రెబ్బెన మండల కేంద్రంలోని నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రాంగణంలో 35 మామిడి మొక్కలను నాటడం జరిగిందని ఎస్సై భూమేష్ గారు తెలిపారు .ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ.. పర్యావరణ సమతౌల్యం పరిరక్షించడం మనందరి బాధ్యత అని, దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బెన మండలం,ఆసిఫాబాద్.

Leave A Reply

Your email address will not be published.