సిపిఎస్ రద్దు – పాత పెన్షన్ పునరుద్ధరణకై MEET Our MLA/MP,Minister కార్యక్రమం
జోగులాంబ గద్వాల్ జిల్లా ; ఈరోజు మండల రిసోర్స్ కేంద్రం మల్దకల మండలం నందు భోజన విరామ సమయంలో సీపీయస్ యూనియన్ జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు అధ్వర్యంలో
TSCPSEU రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఆగస్ట్ 23 నుండి మన రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలను/ఎం.పి/రాష్ట్ర,కేంద్ర మంత్రులను కలిసి సిపిఎస్ రద్దు దిశగా వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధానాలను తెలియజేసి అవగాహనపరిచి తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ రద్దు కొరకు ప్రభుత్వానికి తెలియచేయాలని,సహకరించాలని తెలియజేయు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తొలిమెట్టు కార్యక్రమం కోర్స్ డైరెక్టర్ జానకమ్మ , సీపీయస్ జిల్లా సభ్యులు రాజేష్, మండల అధ్యక్షులు రవి గౌడ్ , దస్తగిరి, రవి, మల్లికార్జున్,వెంకటేశ్వర్లు,చంద్ర శేఖర్ రెడ్డి, లక్ష్మణ్,శంకర్ నాయక్,అరుణ కుమారి,దీపిక,నూర్జహాన్,సమీన బేగం,శ్రీలత,రేణుక,సరస్వతి,హరిప్రియ,లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.