సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి అధికారికంగా ప్రకటించడం పై హర్షం వ్యక్తం

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి టి ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిర్ గారికి తెలంగాణ గౌడ అంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ అద్వర్యంలో ఆర్థిక శుభాకాంక్షతో

మీ అమర వేణి నర్సాగౌడ్ తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బూర మల్సూర్ గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ఛైర్మన్ బహుజన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర BC సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గార్లకు రాసిన లేఖల D.O. Lr. No. 504/M (P&E, S& YS) ( Date.25.09.2021 ) కు తక్షణం స్పందించి వారి జయంతి ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు గతంలో ఎప్పుడు లేని విధంగా 10 లక్షల రూపాయల ను కేటాయించుటకు ప్రభుత్వ Memo No. 1550/D/2022 Date. 03 08.2022 ను విడుదల చేసిన సందర్భంగా గౌడ సామాజిక వర్గం తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.

బహుజన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఆగష్టు 8 ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు BC సంక్షేమ శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గారు, మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గార్లు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ లు పాల్గొని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు 10 లక్షల రూపాయల బడ్జెట్ కేటాయించిన సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి (08.08 2022) కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న అన్ని గౌడ సంఘాల ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

Leave A Reply

Your email address will not be published.