సమావేశానికి ప్రతి ఒక్క రిమ్స్ కార్మికుడు హాజరు కావాలి

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ 03/08/2022 ; ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో AITUC తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దొంగ్రే చందు ఆధ్వర్యంలో AITUC రిమ్స్ బ్రాంచ్ ఆఫీస్ లో శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ & పేసేంట్ కేర్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ హాజరై మాట్లాడుతూ గత నెల 29/07/2022 శుక్రవారం రోజు రిమ్స్ డైరెక్టర్ గారికి రిమ్స్ కార్మికులపై కొత్తగా కాంట్రాక్ట్ చేపట్టిన మురళీకృష్ణ ఏజెన్సీ వారితో కార్మికులకు మధ్య మీటింగ్ ఏర్పాటు చేయాలని మరియు పాత కాంట్రాక్టర్ స్పార్క్ ఏజెన్సీ వారికి మరియు కార్మికులకు మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఈరోజు వరకు స్పందన లేదని రిమ్స్ డైరెక్టర్ గారిని కలవడంతో వెంటనే స్పందించి రేపు అనగా తేదీ 04/08/2022 గురువారం రోజున ఉదయం 11:00 గం.లకు కాంట్రాక్టర్ల కు మరియు కార్మికులకు మధ్య మీటింగ్ ఏర్పాటు చేపిస్తానని తెలియ చేయడం జరిగింది. కావున రిమ్స్ లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ పేసేంట్ కేర్ కార్మికులు తప్పకుండా ప్రతి ఒక్కరు మీటింగ్ లో పాల్గొనవలసిందిగా తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ గౌరవ అధ్యక్షులు పట్లే రమేష్ రిమ్స్ బ్రాంచ్ కార్యదర్శి MD ఖాసీం, జిల్లా నాయకులు SK ఇక్బాల్, శ్రీనివాస్, కవిత, లస్మక్క, రుక్మిణి, సంగీత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.