విద్యార్థులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేసిన కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్ట్ 19 ; స్వాతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా శుక్రవారం భూపాలపల్లి జిల్లాలోని ఘనపురం మండలంలోని గాంధీనగర్ లో గల సిఎస్ఐ పాఠశాలలో విద్యార్థులకు, భూపాలపల్లి పట్టణంలోని వంద పడకల హాస్పిటల్ నందుగల బాలింతలకు రోగులకు, భూపాలపల్లి పట్టణంలోని మానసిక వికలాంగుల ఆశ్రమ పాఠశాలలో మానసిక వికలాంగులకు, పట్టణంలోని వృద్ధాశ్రమాలలో గల వృద్ధులకు పండ్లు, స్వీట్లు, బ్రెడ్లు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ,తమ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో వారు మాట్లాడుతూ, స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని అందులో భాగంగా భూపాలపల్లి జిల్లాలో ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్ర మాలు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు .రక్తదాన శిబిరాలకు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో రక్తదానం చేశారని, భూపాలపల్లి పట్టణంలో జరిగే వజ్రోత్సవ కార్యక్రమాలకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, విద్యార్థిని, విద్యార్థులు ,అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారని వారు తెలిపారు. ఈరోజు చేపట్టిన కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటిదని సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు మనోధైర్యాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, వారు తెలిపారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఘనంగా నిర్వహిస్తున్నారని, మరే రాష్ట్రాలలో ఇంత ఘనంగా వజ్రోత్సవాలు జరగడంలేదని వారు తెలిపారు. ఇక ముందు జరగబోయే కార్యక్రమాలకు తమ వంతు సహకారాన్ని అందించి వద్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకునే విధంగా తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, సిపిఓ శామ్యూల్, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ సంజీవరావు, డిఎంహెచ్వో శ్రీరామ్, ప్రజా ప్రతినిధులు వార్డు కౌన్సిలర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.