వరద బాధితులకు రు. 10 వేలు నష్టపరిహారం పంపిణీ చేస్తాం.

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్ట్ 1 ; భూపాలపల్లి జిల్లా లోని వరద బాధితులకు 10,000 రూపాయలు జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ మాట్లాడుతూ వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన గౌరవనీయులు శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఏటూరి నాగారంలో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి వరద బాధితులకు పదివేల రూపాయలు భరోసా సహాయం కింద అందించాలని తెలిపారు. దానిలో భాగంగా భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు సోమవారం నుండి పదివేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పలిమెల, మా ముత్తారం టేకుమట్ల, మహాదేవపూర్, భూపాలపల్లి, మలహర్రావు మండలాలలోని వరద బాధితులకు పదివేల రూపాయలు ప్రభుత్వం భరోసా కల్పించింది, వరద బాధితుల ను అధికారులు గుర్తించి వారి యొక్క బ్యాంకు ఖాతా నెంబరు, బ్యాంకు ఐఎఫ్సి కోడ్ నెంబర్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికి పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో నాలుగువేల మంది వరద బాధితులకు రెండు రోజులలో పదివేల రూపాయలు జమ చేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.