వరద బాధితులకు కాంగ్రెస్ చేయూత

ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో పలువురు వరద బాధితులకు చేయుతను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని దర్లోడ్డి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి చేరి, సర్వం కోల్పోయిన బాధితులకు గురువారం రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ బాధితులకు రేషన్ కిట్లను పంపిణీ చేశారు.ఈ మేరకు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ భారీ వర్షాలతో నష్టపోయిన వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం తక్షణ సహాయం కింద నిత్యవసర సరుకులు సైతం అందించ లేకపోయిందని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు గాని, సర్వం కోల్పోయిన ప్రజలు గాని ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని అన్నారు. తమ దృష్టికి వచ్చిన వరద బాధితులకు ఎంతోకొంత చేయుతను అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నగేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్, సేవాదళ్ అధ్యక్షులు మోతీ రామ్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శివాజీ, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆనంద రావు, నాయకులు అస్మద్, షాఖిల్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.