రేషన్ సరుకులు పంపిణీపై సంతబొమ్మాళి మండల తహసీల్దారు వారికి వినతిపత్రం అందించిన మండల తెలుగుదేశం పార్టీ

రేషన్ వ్యవస్థపై ప్రభుత్వం చూపెడుతున్న వైఖరిని నిరసిస్తూ సంతబొమ్మాళి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండల తహసీల్దారు వారికి వినతిపత్రం అందించారు.కేంద్రం పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ ను గత నాలుగు నెలలుగా అందించడం లేదని ఇప్పుడు అందిస్తున్న కొంతమందికే ఇవ్వడం సబబు కాదని అర్హులందరికీ ఉచిత రేషనును అందించమని అందులో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం హయాంలో అందించిన బియ్యం,పంచదార, కందిపప్పు, వంటనూనె, మినపగుళ్లు, పశువు, కారం, ఉప్పు, మినపగుళ్లు అన్ని నిత్యవసర సరుకులును రేషన్ షాపులలో పంపిణీ చేయాలని డిమాండు చేశారు.కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీరు భీమారావు,ప్రధాన కార్యదర్శి రెడ్డి అప్పన్న,జిల్లా అధికార ప్రతినిధి పుక్కళ్ళ శ్రీనివాసరావు,మండల తెలుగుయువత అధ్యక్షులు కూచెట్టి భానుప్రకాష్,సీనియర్ నాయకులు కర్రి విష్ణు,సూరాడ భీమారావు,కుచెట్టి కాంతారావు,మెండ అప్పారావు,పంగ అసిరినాయుడు,సవ్వాన ప్రసాదురావు,గూట్ల మల్లేష్,పిట్ట రాజులు,చల్ల జగ్గారావు,లమ్మత చక్రవర్తి,మెండ త్రినాథ,పామల లక్ష్మణ,వాన భాస్కరరావు,తెలుగుయువత నాయకులు సూరాడ దాసురాజు,సూరాడ రాయుడు,సుగ్గు నాగిరెడ్డి,కొవిరి కోటేష్ తదిరిదులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.