రిటైర్డ్ ఆర్మీ‌ జవాన్ దురిశెట్టి శ్రీనివాస్ కు ఎక్స్ మిలటరీ సర్వీస్మెన్లు ఘన స్వాగతం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గణ సన్మానం రాజస్థాన్ లోని జైసల్మేర్ 173 బెటాలియన్లో గత 21 సంవత్సరాలుగా దేశ సేవకు అంకితమై రిటైర్మెంట్ తీసుకుని తన స్వస్థలం పట్టణానికి విచ్చేసిన రిటైర్డ్ ఆర్మీ‌ జవాన్ దురిశెట్టి శ్రీనివాస్ కు ఎక్స్ మిలటరీ సర్వీస్మెన్లు ఘన స్వాగతం పలికారు. కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్ లో వారికి పూల మాలలు వేసి, పుష్పగుచ్చం అందించి కరతాలద్వనులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ అధ్యక్షులు అబ్దుల్ నయీమ్, ప్రధాన కార్యదర్శి పీ. మండల్, జాయింట్ సెక్రటరీ ఎంకే తివారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే. శివ, అడ్వైజర్లు నరేందర్ యాదవ్, పీ శివ, ఎస్పీ మండల్, ఆనంద్ మండల్, ఆడీటర్లు, అనురోద్ సింగ్, డీజే సర్కార్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.