రావివలస రోడ్డుసొగసు చూడతరమా

సంతబొమ్మాళి, ఆగష్టు 9,(ప్రజా నేత్ర) ; సంతబొమ్మాళి మండలం పరిధిలో ని వడ్డితాండ్ర -రావివలస రోడ్డు గోతుల మయమైంది. నిత్యము ఈ రహదారి వెంబడి డివిజన్  కేంద్రం టెక్కలి కి రాకపోకలు జరుగుతున్నాయి. అడుగుకో గుంటతో దర్శనం ఇస్తున్నాయి. ఈ రహదారి వెంబడి బస్సులు, ఆటోలు, మోటారు సైకిళ్ళు నడుస్తుంటాయి. దాదాపు 9 గ్రామాల ప్రజలకు ఎంతోప్రయోజనకారిగా  అడుగు కు ఒక గుంత దర్శనం ఇస్తుంది.  ఈ రహదారిపై పక్కా రహదారి కోసం గత ప్రభుత్వం హయాంలో నిధులు మంజూరైన కార్యరూపం దాల్చిలేదు దీనితో ఈ మరింత పాడైంది. దీనికి తోడు  ఇటీవల గ్యాస్ ఆధారిటీ  ఇండియా వారు ఈ రహదారి పై పైపు లు వేసి సక్రమంగా మట్టికప్ప లేదు. దీనితో నడవడానికి కూడా వీలు పడని దుస్థితి నెలకొంది. ఇంత జరిగిన సంబంధిత ఆర్ అండ్ బి శాఖ అధికారులకు చలనం లేకపోవడం విమర్శలు కు తావిస్తుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి పై ప్రమాదాలు జరగక ముందే ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి మరమ్మతులు చేపట్టాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.