భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ: 03-08-2022 ; ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని TNGO సెంట్రల్ గార్డెన్ లో జరిగిన CPI జిల్లా 25వ మహాసభలలో జిల్లా నూతన కార్యవర్గాన్ని CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్,, తక్కళ్ళపల్లి శ్రీనివాస్ మరియు కామ్రేడ్,, కళావేన శంకర్ ఎన్నుకున్నారు. నూతన జిల్లా కార్యదర్శి గా ముడుపు ప్రభాకర్ రెడ్డి, సహాయ కార్యదర్శి గా సిర్ర దేవేందర్, కార్యవర్గ సభ్యులుగా భాస్కర్, దేవిధాస్, శ్రీనివాస్ యాదవ్, నళిని రెడ్డి, భూపతి రెడ్డి, గోవర్ధన్, వమాన్ లతో మొత్తం 09 మందితో జిల్లా కార్యవర్గాన్ని, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా 29 మందితో నూతనంగా జిల్లా సమితిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.

Leave A Reply

Your email address will not be published.