భారత్ నీతి డిజిటల్ హిందూ కాంక్లివ్ భాగంగా శ్రీ పి మురళీధర్ రావు గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన డా. కొత్తపల్లి శ్రీనివాస్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వినయ్ గార్డెన్ లో ఈ రోజు భారత్ నీతి డిజిటల్ హిందూ కాంక్లివ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ. పి మురళీధర్ రావు గారికి భారతీయ జనతా పార్టీ కొమురం భీం జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ గారు వారికి ఘన స్వాగతం పలికి వారితో పాటు జ్యోతి ప్రజ్వలన చేసి డిజిటల్ హిందూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ. పి మురళీధర్ రావు గారు దేవికా రెడ్డి, భారత్ కుమార్, దేవంగ్ దవే,గారు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో యువత పాత్ర మరియు జాతీయవాదం మరియు దేశభక్తి తదితర అంశాలపై యువతకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది.జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ గారు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ. పి మురళీధర్ రావు గారిని శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు క్రిష్ణ కుమారి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కాలిదాస్ ముజుందర్,ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి అజ్మెరా ఆత్మారం నాయక్, తాలూకా కన్వీనర్ వీరభద్ర చరి, సీనియర్ నాయకులు పాల్వాయి హరీష్ బాబు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల ఇంఛార్జిలు,నాయకులు, అన్ని సంఘాల నాయకులు, హిందూ బందువులు,కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.