బోధనకు తీవ్ర ఆటంకం కలిగించే వివిధ రకాల యాప్ లను రద్దు చేయాలి – ఫ్యాప్టో

ప్యాపిలి ఆగస్టు 18(ప్రజా నేత్ర న్యూస్): తరగతి గదిలో ఉపాధ్యాయులను విద్యార్థులకు పాఠాలు చెప్పనివ్వకుండా ఉపాధ్యాయుల బోధనకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్న పలు రకాల యాప్ లను రద్దు చేయాలని ప్యాపిలి మండల ఫ్యాప్టో నాయకులు బి సర్వజ్ఞ మూర్తి డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొని వచ్చిన ముఖ చిత్ర హాజరు యాప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఉపాధ్యాయులు ఇప్పటికే తమ వ్యక్తిగత చరవాణి యందు పలు రకాల యాప్ లు అయిన ఐ ఎం ఎం ఎస్,అకడమిక్ మానిటరింగ్,స్టూడెంట్ అటెండెన్స్ యాప్,స్కూల్ అటెండెన్స్ యాప్ తదితర యాప్ లతో కుస్తీ పడుతున్నారని,ఈ యాప్ లను వాడటం వల్ల ఇప్పటికే బోధనా సమయం తీవ్రంగా నష్టపోతున్నామని కావున యాప్ లను తగ్గించాలని ఇప్పటికే యుటిఎఫ్ గా,ఫ్యాప్టో గా ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం అత్యంత కక్ష పూరితంగా మరిన్ని యాప్ లను ఉపాధ్యాయుల పైన రుద్దుతుందని వాపోయారు.కావున ఇంటిగ్రేటెడ్ యాప్ నందు ముఖ చిత్ర హాజరు వేయడం జరగదని అందుకోసం ప్రభుత్వమే డివైస్ లను ఇవ్వాలని కోరారు.ఈ మేరకు హాజరు వేయలేము అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహబూబ్ బాషాకు వినతిపత్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజనప్ప,వెంకటేష్ నాయక్,లక్ష్మి దేవి,పద్మావతమ్మ,రవీంద్రా,శంకర్,భాగ్యలక్ష్మి,సునీత,నీలోఫర్, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు

🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.