బేల కస్తూర్బా విద్యాలయంలో ఆహార వికటించి విద్యార్థుల తీవ్ర అస్వస్థత

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేది: 01-08-2022 ; ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో ఆహారం వికటించి దాదాపు 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. వీరిని వెంటనే జిల్లా కేంద్రంలో గల రిమ్స్ కు తరలించారు. విద్యార్థి సంఘాలు వెంటనే ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరంAISF, PDSU, ASU విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా విద్యాధికారుల నిర్లక్ష్యంతోనే కేజీబీవీ లలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయనీ అన్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో కేజీబీవీ విద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయన్నారు. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి కేజీబీవీ అధికారులపై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో మాట్లాడడానికి రిమ్స్ కు వచ్చిన అసిస్టెంట్ కలెక్టర్ మరియు ఎమ్మెల్యే జోగు రామన్న గారికి పరిస్థితిని వివరించారు. స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి పరిస్థితులు జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మేస్త్రం భాస్కర్, పిడిఎస్యు అధ్యక్షులు వినోద్ నాయక్, ఏ ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు సలాం వరుణ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మడవి గణేష్, గుండాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.