బహుముఖ ప్రజ్ఞాశాలి సామల సదాశివ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కాగజ్ నగర్ బస్ స్టేషను ఎదురుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ కు చెందిన తెలుగు, ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు, హిందుస్తానీ సంగీతాన్ని తొలిసారిగా తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసిన తొలి తెలుగు రచయిత డా. సామల సదాశివ మాస్టర్ గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారి అభిమానులు మాట్లాడుతూ సదాశివ మాస్టర్ గారి సేవలకు పద్మ అవార్డు ఇచ్చి సత్కరించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దాసరి వెంకటేష్, సంఘ మార్గదర్శకులువ కుడిక్యాల రాజమౌళి, మార్త సత్యనారాయణ, పర్శ చంద్రశేఖర్, సంఘ సలహాదారులు కటుకం మధుకర్, కార్యనిర్వాహక అధ్యక్షురాలు దాసరి నాగరాణి, ప్రచార కార్యదర్శి జక్కం వసంత, వేముల వెంకటేష్, సామల విశ్వేశ్వర విశ్వేశ్వర్ రావు, మాచర్ల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు పొన్న స్రవంతి, వివిధ వార్డ్ ఇంచార్జ్ లు చిందం అశోక్, అడేటి శంకర్, కొంగ వెంకటేష్, రాపెల్లి కనకరాజు, అక్కేనెపల్లి వాసు, బూర సుధాకర్, బూర కుమార్, కొలిపాక జగదీశ్వర్, బడుగు భూమయ్య, బిట్ల వెంకటస్వామి, పరికిపండ్ల సురేందర్, బంక కోటేశ్వరరావు, మామిడాల రామకృష్ణ, తౌటం శ్యాం కుమార్, సామల శ్రీవర్ధన్, చిందం ప్రభాకర్, ఈగ రాజేష్, వడ్లకొండ వెంకటేష్ మరియు పద్మశాలి కులబాంధవులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.