ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న పాలకులు.. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

ప్రజానేత్ర న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన,తేది:19- ఆగస్ట్ -2022: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ ఆరోపించారు.అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను రెబ్బెన మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకోచ్చి ప్రభుత్వ విద్యను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యారంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాలు, వసతి గృహలకు సొంత భావనలు నిర్మించాలని డిమాండ్ చేశారు. గత ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26 నుండి 28 వరకు కొత్తగూడెంలో నిర్వహిస్తున్నట్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా ఉపాధ్యక్షులు సాయి, డివిజన్ కార్యదర్శి పర్వతి సాయి, మండల కార్యదర్శి బాలు నాయక్, AIYF జిల్లా సహాయ కార్యదర్శి రహీం, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బెన మండలం,ఆసిఫాబాద్.

Leave A Reply

Your email address will not be published.