ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ విద్యార్థి సేన పిలుపు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ విద్యార్థి సేన పిలుపుఆదివాసీ విద్యార్థి సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ పెందోర్ దత్తు

ఇంద్రవెల్లి// ఆదివాసీ జనాభా పై 1982 సంవత్సరంలో జెనివాలో జరిగిన ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ సమావేశానికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తెదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని,అదే స్పూర్తితో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆదివాసీ గూడెం లో ఆదివాసీ జెండా ఎగురవేయాలని ఆదివాసీ విద్యార్థి సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ పెందోర్ దత్తు పిలుపునిచ్చారు.ఈ ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆదివాసీ సేన నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు, ఆరోగ్యం, విద్యా, మానవ హక్కులు, పర్యావరణం, సామాజిక ఆర్థిక అభివృద్ధి, ఎదుర్కొంటున్న సమస్యల కోసం ప్రపంచ సహకారాన్ని పటిష్టం చేసేందుకు దశాబ్దం లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.ప్రపంచ ఆదివాసీ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంఛార్జి రాయిసిడం జంగుపటేల్, తుడుం దెబ్బ ఉట్నూర్ డివిజన్ కన్వీనర్ కోట్నక్ బారిక్ రావు, ఆదివాసీ సేన నాయకులు సలాం జాకు,మడవి కిరణ్ కుమార్,బుర్కూలే మారుతి తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.