ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదిలాబాద్ నియోజకవర్గ సమన్వయ కర్త వొడ్నాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ లు అన్నారు.ఏ ఐ సి సి ఆదేశానుసారం, టి పి సి సి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.
* దేశంలో మోడీ, రాష్ట్రంలో కేడి ఇద్దరు కలిసి దోచుకుంటున్నారు.
* అటు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం వల్ల , ఇటు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీలు, బస్ చార్జీలు పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజల జీవనమే కష్టంగా మారింది. ధరల పెంపు గుది బండగా మారింది.
* దానికి తోడు ఈ మధ్యకాలంలో నిత్యావసర వస్తువులపై జిఎస్టి విధించడం వల్ల పేద ప్రజలపై ఆర్థిక భారం పడింది.
* ఆనాడు కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జిడిపి రేటు అధికంగా ఉంటె ఈనాడు నరేంద్ర మోడి ప్రభుత్వ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్పానికి పడిపోయింది అంటే ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు?
* భాజాపా పాలనలో పేదరికం ఎక్కువైంది. ఈ ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ దేశం లోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తుంది. పేదవాడిని దోచి అదానీ అంబానీలకు కట్టబెడుతుందని అన్నారు.
*తనకు అధికారం ఇస్తే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తనన్న హామీ ఎందుకు నెరవేర్చలేదొ నిరుద్యోగులకు చెప్పాలి.
* ఇక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో ప్రజల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు ముంపు కు గురైన బాధితులకు నష్ట పరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.
* వరద బాధితులకు తక్షణ సహాయం కింద 10000 ఇస్తానన్న ముఖ్యమంత్రి ప్రకటన కార్యరూపం దాల్చలేదు.
* ఇప్పటివరకు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వరదల వల్ల జరిగిన సర్వే చేసి నష్టాన్ని అంచనా వేయకపోవడం దురదృష్టకరమని వెంటనే అధికారులు నష్ట పరిహారం అందేలా చూడాలని అన్నారు.
* కాళేశ్వరం అవినీతి తో కూడిన ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే దానిపై విచారణ జరపాలి.
* కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావలని కోరారు.
* పిల్లలు వాడుకునే పెన్సిల్, రబ్బర్, షార్ప్నర్ ల పై జీఎస్టీ దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువులపై విధించిన జీఎస్టీ ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు.
* నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అన్నారు.
* కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ని రద్దు చేయాలని పున:సమీక్ష జరుపాలని కోరారు.
* వరద బాధితులకు నష్ట పరిహారం వెంటనే అందించాలని, పూర్థిగా నష్టపోయిన వారికి పునరావసం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమం లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఏ ఐ సి సి సభ్యురాలు గండ్రత్ సుజాత, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ రెడ్డి, యాసం నర్సింగ రావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెళ్లి శ్రీధర్, అధికార ప్రతినిధిలు మునిగెల నర్సింగ్, పసుల చంటి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ ఖాడే, షేక్ ఖలీమ్, పట్టణాధ్యక్షులు గుడిపెల్లి నగేష్ , మాజీ జడ్పిటిసి రాందాస్ నక్లే, బేలా, ఆదిలాబాద్ రూరల్, మావల మండలదక్షులు ఫైజుల్లా ఖాన్, సంజయ్ ధూబే, చంద్ర శేఖర్.