నౌపడ సత్యనారాయణకు అవార్డు దక్కడంపై మత్స్యకార నాయకులు హర్షం

సంతబొమ్మాళి, ఆగస్టు 8, (ప్రజా నేత్ర):- మండలంలో మేఘవరం గ్రామానికి చెందిన నౌపడ సత్యనారాయణకు ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు దగ్గడంపై మండలానికి చెందిన పలువురు మత్స్యకార నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పూణేకు చెందిన ఈ సంస్థ కొంతమంది ఉన్నత విద్యనభ్యసించిన వారికి 2022 అవార్డులు ప్రకటించింది . ఢిల్లీలో ఉంటున్న సత్యనారాయణ ప్రస్తుతం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం విదితమే . ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మాట్లాడుతూ సత్యనారాయణ ఒక సామాజిక కార్యకర్తగా ఈ ప్రాంతంలో అనేక యువజన సంఘాలు ఏర్పాటు చేసి, తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. ఇలాంటి మరిన్ని అవార్డులు ఆయన అందుకోవాలని కోరుతూ సత్యనారాయణకి ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ వైస్ ఎంపీపీ సూరాడ భీమారావు, సంతబొమ్మాళి బిసి సెల్ ప్రధాన కార్యదర్శి సూరాడ ధనరాజు, తెలుగు యువత ఉపాధ్యక్షులు సూరాడ రాయుడు, తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ బైపల్లి కుమార్ స్వామి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.