నేడు సంతబొమ్మాళి లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.

సంతబొమ్మాళి, ఆగష్టు 19 ;  జగనన్న సీఎం కావడం కావడం వల్లే సంక్షేమ పధకాలు అమలవుతున్నాయని ఇది ప్రజలు అదృష్టం మని  ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రం సంతబొమ్మాళి లో సచివాలయం-2పరిధిలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగాసర్పంచ్ కళింగ పట్నం లక్ష్మి అధ్యక్షతన  శుక్రవారం గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ మాట్లాడు తూ  పాదయాత్ర లో  ప్రజలుపడుతున్న  కష్టాలు చూసి చలించిపోయిన జగనన్న సీఎం అయిన వెంటనే నవరత్నాలు తో  వారి కష్టాలు నెరవేర్చడం ద్యేయం గా కంకణం కట్టు కున్నారున్నారు.ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన హామీలు మూడేళ్లు లో 95%నెరవేర్చిన ఘనత జగనన్న కె దక్కిందన్నారు.గత ప్రభుత్వం హయాంలో పచ్చ చొక్కాలకే పరిమితమైన ప్రభుత్వ పథకాలు జగనన్న వచ్చాక అర్హత ఉన్న లబ్ధిదారులు కు రాజకీయాలకు అతీతంగా నేరుగా అందుతున్నాయంటే నిజంగా జగనన్న పేదల పాలిట దేవుడని దువ్వాడ పేర్కొన్నారు.ఈ రోజు నుంచి ఈ పంచాయతీ లో గడప గడప కు వస్తాను మీకు ఏయే పథకాలు అందుతున్నాయి తెలుసుకొని  మీకు ఏమైనా  సమస్యలు ఉంటే వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు.ఈ సందర్బంగా శివరాం పురం గ్రామం లో గడప గడప దువ్వాడ వెళ్లి పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పాల వసంత రెడ్డి, ఎంపీపీ మేరుగు రాజేశ్వరి, పిఎసియస్ అధ్యక్షులుకెల్లిజగన్నయకులు(గోవింద్), ఎంపీపీ  ప్రతినిధి మేరుగు అప్పారావు, వైస్ ఎంపీపీ ప్రతినిదులు పొందల రామకృష్ణ, నక్క భీమారావు, ఎంపీటీసీప్రతినిధులు దూబ వేణు, శిమ్మ సోమేసు తహసీల్దార్ చలమయ్య, ఎంపీడీఓ ఉమాసుందరి పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లో అధికారులు, డ్వాక్రా మహిళలు సచివాలయం సిబ్బంది వాలంటీర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.