నాణ్యామైన విద్యుత్ నీ అందించండి…..!
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం లోని నౌపడా ఉన్న 33kv ఉపకేంద్రం లో విద్యుత్ సరఫరా సరిగా లేదని స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకొనే నాధుడే లేరని స్థానికులు వాపోతున్నారు.
విద్యుత్ సరఫరా లో లోపాలు ఏంటి వివరణ కోరగా… సబ్ స్టేషన్ టౌన్,ఈస్ట్ కోస్ట్, రూరల్ అని మూడు పిడర్ ఉన్నాయని దానిలో టౌన్ బ్రేకర్ పనిచేయట్లేదని దానిమీద ఉన్న లోడుని ఈస్ట్ కోస్ట్ పీడర్ మీదవేస్తున్నామని రెండు LV లు ఉన్నాయి అది కూడా ఒకటే పనిచేస్తుంది. దానివల్ల అప్పుడప్పుడు పవర్ ఎక్కువ తక్కువ అవుతుందని దానివల్ల చిన్నచిన్న సమస్యలు వస్తున్నాయని సిబ్బంది చెప్పుతున్నారు.
మాకు విద్యుత్ సరఫరా సరిచేయాలని సబ్ స్టేషన్ ఇంచార్జ్ AE .ఎం.శివ,DE రాజశేఖర్ line men చిన్నవాడు ను స్థానిక ప్రజలు ,రొయ్యల చెరువులు రైతులు కోరుతున్నారు