దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలి అన్నదే ప్రభుత్వ సంకల్పం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి

గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన దళిత బంధు లో ఎంపికైన అయినా మహేష్ కి 10 లక్షల వ్యయంతో మహేష్ సెంట్రింగ్ ను ఏర్పాటు చేసుకొని సంబంధించిన అన్ని వస్తువులు సమకూర్చుకొని గద్వాల శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది.గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గారు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగిందిగ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఎమ్మెల్యే గారు హరితహారం లో భాగంగా మొక్కలు నాటడం జరిగినది .ఎమ్మెల్యే గారిని మహేష్ ఘనంగా సత్కరించారుఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.ప్రపంచంలో ఏ ప్రధానమంత్రికి ఏ ముఖ్యమంత్రి కి రాని ఆలోచనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారికి కలవడం జరిగింది దళితులను కూడా ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి దళితులు ఆర్థికంగా ఎదగాలి దళితులు కూడా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసి నాయకుడు కేసీఆర్ గారు అని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పధకం కుడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగాముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిందేనని ఆయన స్పష్టం చేశారు. దళితబంధు పథకంతో ఆర్థికాభివృద్ధి సాధించడం తో పాటు సమాజాన్ని నిర్దేశించే వ్యక్తులుగా పెరగాలని ఆయన ఆకాంక్షించారు.గతంలో దళితులను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఉపయోగించుకున్నారు తప్ప వారికి ఏమాత్రం కూడా ఇలాంటి ఆర్థిక సంబంధించిన పథకాలను గాని ప్రయోజనాలు గాని పెట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ గారు దళితుల కోసం ప్రత్యేకంగా దళిత బంధు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితుల మహిళలకు కుట్టుమిషన్లు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన పరికరాలను అందజేస్తూ వారికి అన్నివిధాలుగా అండగా నిలిచి దళితులు కూడా ఆత్మ ధైర్యంతో బతికేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్నివిధాలుగా అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్ గారు అని అన్నారు.భవిష్యత్తులో దళిత బంధు ద్వారా ప్రతి ఒక్క దళిత బిడ్డ అభివృద్ధే చెందే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, PACS ఛైర్మన్ తిమ్మారెడ్డి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న, సర్పంచ్ పద్మ , ఎంపిటిసిలు సరోజమ్మ, గోపాల్ రెడ్డి, మండలం పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవారన్న, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, తెరాస పార్టీ నాయకులు విక్రమ్ సింహరెడ్డి, అజయ్, తూం కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, ఆంజనేయులు, చక్రధర్ రెడ్డి, ప్రభాకర్, మండలం యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.