తాసిల్దార్ లేక ఇబ్బందులు పడుతున్న మండల ప్రజలు DRO కు ఫిర్యాదు చేసిన హనుమంతు మాదిగ

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లోని క్రిష్ణగిరి మండలానికి మండల మెజిస్ట్రేట్ అయినటువంటి తహసిల్దార్ గారు లేనందువలన ఏవైనా రెవెన్యూ భూ సమస్యలు ఏర్పడితే పరిష్కరించుకోవడానికి మండల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారనిభూ సమస్యల పరిష్కారం కొరకు క్రిష్ణగిరి ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శిస్తేతహసిల్దార్ గారు లేరు అని ఏ సమస్య పరిష్కారం అయినా సరే తహసిల్దార్ గారు వచ్చిన తర్వాతే అని మండల రెవెన్యూ అధికారులు సమాధానం ఇస్తుండడంతో నిరుత్సాహంతో వెనుతిరిగ వలసిన పరిస్థితి ఏర్పడుతుందనిదీంతో శాఖకు సంబంధం లేని వారు అమాయకులైన ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఏర్పడుతుందనికావున వీలైనంత త్వరగా క్రిష్ణగిరి మండలానికి తహసిల్దార్ గారిని నియమింపవలసిందిగా హనుమంతు మాదిగ కర్నూలు జిల్లా డిఆర్ఓ గారిని కోరడమైనది.ఎస్ హుస్సేన్ మియా ప్రజా నేత్ర రిపోర్టర్ క్రిష్ణగిరి

Leave A Reply

Your email address will not be published.