డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం వేడుకలు :DYFI

ఖమ్మం: భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం( ఫ్రెండ్షిప్ డే) కార్యక్రమాన్ని త్రీ టౌన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకొని స్నేహితుల శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు శీలం వీరబాబు మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సోదర భావంతో కలిసి స్నేహం చేయాలని ఆయన కోరారు మంచి స్నేహితులంటే ఎప్పుడూ ఎవరికీ ఏ కష్టం వచ్చినా స్నేహితుడు లాగా తోటి స్నేహితుడికి ఉపయోగపడాలన్నారు స్నేహితులంటే కొట్టుకోవటం తిట్టుకోవడం గొడవలు పెట్టుకోవటం కాదన్నారు మంచి స్నేహితులు చిరకాలం కలిసే ఉండాలన్నారు ఎంతో మంది స్నేహితులు కలిసి వివిధ రంగాలలో విజయం సాధించారు చాలా గొప్ప స్థాయిలో చేరుకున్నారు వీటన్నిటికీ స్నేహమే గొప్పది అన్నారు ఇలాంటి స్నేహం చేయడం చాలా అదృష్టం అన్నారు అందుకనే సోదరులు మంచి స్నేహం కోసం కృషి చేయాలి అన్నారు ఈ స్నేహితుల దినోత్సవ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ ఉపాధ్యక్షుడు యర్రా సాయికుమార్ త్రీ టౌన్ నాయకులు ఏర్పుల నరేష్, గుండాల గోపి, అరవైపల్లి వెంకటేష్ ,ఎర్రబోయిన రాకేష్, గుండాల సాయి, ఎర్రబోయిన జనార్ధన్, గడ్డం గోపి, శీను తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.