టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుమ్మకై ప్రజలకు మోసం చేస్తున్నాయి అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు సాజిద్ ఖాన్
మీడియాతో జిల్లా పార్టీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ కేంద్రం లొ అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ లు ఒక్కటై ప్రజలకూ నట్టేట ముంచుతున్నరు. అదిలాబాద్ బందును ప్రకటించిన బీజేపీ నాయకులూ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.విమానాశ్రయం, సీసీఐ, రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎర్పాటు విషయంలో ఒకరిపై ఒకరు నెట్టుకుంటూన్నారని విమర్శించారు. హైద్రాబాద్ నాగపూర్ పట్టణాలకు మధ్యలో ఉన్న అదిలాబాద్ పట్టణానికి విమానాశ్రయం ఏర్పాటు చేయడంతో ప్రజలకు సేవలు అందుబాటులో వస్తాయన్నారు. త్రిబల్ తల్లక్, ఆర్టికల్ 370, లోక్ సభ రాజ్యసభ స్పీకర్ ఎన్నికల్లో ఒక్కటై ఇప్పుడు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాయన్నారు. ఎప్పటికైనా ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని విమానాశ్రయం, CCI, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మానం చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్, జిల్లా మైనారిటీ అద్యక్షులు షకీల్, జిల్లా అధికార ప్రతినిథి మునిగేలా నర్సింగ్, ఎస్సి సేల్ జనరల్ సెక్రటరీ కాంబ్లీ శివాజి, బీసి సేల్ అధ్యక్షులు రాజు యాదవ్, జిల్లా జనరల్ సెక్రటరీ కళిమ్ తదితరులు పాల్గొన్నారు..