జోగులంబా గద్వాల్ జిల్లా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ

గద్వాల టౌన్ : గద్వాల పట్టణంలో వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ చేస్తే చర్యలు తప్పవని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని అంభెద్కర్ చౌరస్త లో శుక్రవారం వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ… యూవత సిగ్నల్స్ తప్పించుకోవడానికి గల్లీ రోడ్లలో తిరుగుతున్నారు, సిగ్నల్స్ ఏర్పాటు చేసింది మీకోసమే, మహా అయితే ఒక్క నిమిషం సిగ్నల్స్ సమయం ఉంటుంది. గల్లీ రోడ్ల నుండి వెళ్లి ప్రమాదాల గురికాకండి, ప్రతి వాహన దారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తే ప్రమాదాలు జరగవ్ఆన్నారు. వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ తో మాట్లాడిన, సిగ్నల్ దగ్గర జంపింగ్ చేసిన, త్రిబుల్ రైడింగ్ చేసిన ఆటోమేటిక్ గా సీసీ కెమెరాలు నమోదు అవుతుందని, జరిమానా ఇస్తామన్నారు ఈ విషయాన్ని ప్రతి వాహనదారులు గమనించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు, వాహన తనిఖీ లో తప్పక వాహనం యొక్క సంబంధిత ధ్రువపత్రాలు తనిఖీ చేస్తామని తెలియజేశారు. ఇలాంటి వాహన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు శివకుమార్, జహీరుద్దీన్, కృష్ణ నాయుడు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.